చిత్తూరు జిల్లాలో ఘోరం : 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం

Mass rape of a married woman
Mass rape of a married woman

ఏపీలో అత్యాచారాలు ఆగడం లేదు..ఓ పక్క దిశ చట్టం, పోలీసులు కఠిన శిక్షలు, చర్యలు చేపడుతున్నప్పటికీ..కామాంధులు మాత్రం ఆగడం లేదు. పసి పిల్లలపైనే కాదు 80 ఏళ్ల వృద్దురాళ్లను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులో 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేయడం సంచలనంగా మారింది. వృద్ధురాలిపైనే కాదు ఆమె మనవరాలిపైనా అత్యాచారానికి యత్నించాడు.

వివరాల్లోకి వెళ్తే…

పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో బాధిత వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం మంచంపై ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గమనించిన అదే కాలనీకి చెందిన బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఆమె మనవరాలు భోజనం తీసుకుని రాగా, నిందితుడు ఆమెపైనా అత్యాచారానికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. నిన్న ఇంటికి వచ్చిన తండ్రికి బాలిక విషయం చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలు, ఆమె మనవరాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.