న‌వీ ముంబయిలో 16 మంది విద్యార్థుల‌కు క‌రోనా

ముంబయి: న‌వీ ముంబయిలో 16 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. బాధిత విద్యార్థులంతా 8 నుంచి 11వ త‌ర‌గ‌తికి చెందిన‌వారే. ఈ క్ర‌మంలో ఆ స్కూల్లోని 600 మంది విద్యార్థుల‌కు వైద్యారోగ్య సిబ్బంది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న ఓ విద్యార్థి తండ్రి ఇటీవ‌లే ఖ‌త‌ర్ నుంచి ఇండియాకు తిరిగొచ్చాడు.

ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఆ కుటుంబానికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, తండ్రికి నెగిటివ్‌గా, కుమారుడికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇక ఆ విద్యార్థితో సన్నిహితంగా మెలిగిన పిల్ల‌లంద‌రికీ కొవిడ్ టెస్టులు చేయ‌గా, 16 మందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో 10,582 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/