తొలి దశలో 16.5 లక్షల ఇళ్లు

‘వైస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్

AP Chief Minister YS Jagan Mohan Reddy
AP Chief Minister YS Jagan Mohan Reddy

Kakinada: ‘వైస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు’ కార్యక్రమంలో భాగంగా తొలి దశలో 16.5 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.  తూర్పుగోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొమరగిరి మండలంలో ఈ కార్యక్రమాన్ని ఆయనీ రోజు ప్రారంభించి  పైలాన్ ను ఆవిష్కరించారు.

ఈ  సందర్భంగా  అక్కడ నిర్మించిన మోడల్ హౌస్ ను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు, 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 

 తాము  ఇళ్లను కాదని… ఏకంగా గ్రామాలనే నిర్మిస్తున్నామని జగన్ అన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా 17,500 వైయస్సార్ జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని తెలిపారు.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/