15వ పాశురం: తిరుప్పావై
ఆధ్యాత్మికం :ధనుర్మాసం ప్రత్యేకం

ఎల్లే! ఇళంకిళియే! ఇన్న ముఱంగుదియో,
శిల్లెన€ళై యేన్మిన్ నంగైమీర్! పోదరుకినే€న్
వల్లై ఉన్‌కట్టు రైకళ్ పండేయున్ వాయరితుమ్
వల్లీర్‌కళ్ నీంగళే నానేదా నాయిడుగ
వల్లైనీపోదాయ్! ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్ పోన్దెణ్ణిక్కొళ్ వల్లా నై కొనా నై మాత్తారై మాత్తళిక్క
వల్లానై, మాయనై ప్పాడేలో రెమ్బావా§్‌ు పదిహేనవ పాట
లే చిలుక పలుకులా ఓ చిన్నదానా! లేచిరాకున్నావు ఇది నీకు తగునా?
ఉన్న ఉదుటున లేప కారణంబేమి? లేచి వచ్చి నేను చేయునది ఏమి? కువలయా పీడమును కూల్చివేసినవాని,కంసాది రాక్షసుల కాలరాసిన వాని, పలుకు పలుకున చిలుక పలుకు చున్నట్లు తేనె బలుకుచున్నట్లు, మధుర మధురముగ పరమాత్మ లీలలు పాడి వినిపించు పడుచులందరు వచ్చిరి పరిగణించు.
భావం: లోనిగోపికకు, వెలుపలి గోపికల మధ్య ఈవిధముగా సంవాదము జరుగు తున్నది. వె.గో: ఓ లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కలదానా ఇంకను నిదురించు చున్నావా?లో.గో: సమర్థులయిన గోపికలారా, గొడవ చేయకండి, నేను వస్తున్నాను కదా!వె.గో:నీవ్ఞ చాలా నేర్పు కలదానవ్ఞ. మాటలలో నైపుణ్యం ఉంది. కాఠిన్యమూ ఉంది. మీరే మంచివారు. సరే. నేను కఠినురాలను. నీ ప్రత్యేకత ఏంటట? ఒకదానవే ఉంటావేంటి? తొందరగా రా!లో.గో: అందరు వచ్చారా?వె.గో: వచ్చారు లేవోయి. కావాలంటే లెక్కించుకో.లో.గో: సరే, నే వచ్చి ఏం చేయాలో చెప్పండి. వె.గో: బలిష్టమగు కువలయా పీడనమను ఏనుగును చంపినవాడు, శత్రువుల దర్పము అణిచినవాడు, మాయావి అయిన కృష్ణుని కీర్తిని గానము చేయుదము రావమ్మా!
ఫలం: పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/