15వ ఆర్థిక కమిషన్‌ నివేదిక రాష్ట్రపతి వద్దకు..

Ram Nath Kovind
Ram Nath Kovind

న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు గురువారం ఆర్థిక కమిషన్‌ సమర్పించింది. ఎన్‌ కె సింగ్‌ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సభ్యులు కమిషన్‌ అందులో ఉన్నా సిఫారసులను రాష్ట్రపతికి అందజేశారు. 2020-21 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నివేదికను తయారు చేశారు. జమ్ము కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ జరగడంతో ఈ సంఘం గతంలో చేసిన ప్రతిపాదనల్లో మార్పులు చేసేందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘం పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు 2020 అక్టోబర్‌ 30 వరకు గడువు ఉంది. దీనిలో 2022 సంవత్సరం నుంచి 2026 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్ను పంపిణీలపై ఇది నివేదిక ఇస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/