సంక్రాంతి సందర్భంగా 159 ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

train
train

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా సొంతూరుకు బయలుదేరనున్న ప్రజల సౌకర్యార్థం దక్షిణమధ్య రైల్వే 159 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా క్రిస్మస్, జనవరి ఫస్ట్, సంక్రాంతి సందర్భంగా రద్దీ పెరుగుతుందన్న నేపథ్యంలో… దక్షిణ మధ్య రైల్వే 65 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాచిగూడ శ్రీకాకుళం, తిరుపతి, సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాచిగూడ శ్రీకాకుళం (07016), శ్రీకాకుళం తిరుపతి (07479), తిరుపతి కాచిగూడ (07146), విజయవాడ రాయనపాడు మీదుగా శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు వెళ్తాయి. కాచిగూడ శ్రీకాకులం మధ్య సువిధ ప్రత్యేక రైలును నడపనున్నారు. ప్రత్యేక రైళ్లు ఎలాగు ఉన్నాయి కదా అని అనుకుంటే.. వాటిల్లో ఛార్జీలు కూడా ప్రత్యేకంగానే ఉండనున్నాయి. సువిధ పేరుతో వెళ్లే ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేసే అవకాశముంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/