దేశంలో కొత్తగా 1,581 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 23,913

corona virus-india


న్యూఢిల్లీ : దేశం లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 5.68 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… వీరిలో 1,581 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,741 మంది కరోనా నుంచి కోలుకోగా… 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 23,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.74 శాతానికి పెరగగా… క్రియాశీల రేటు 0.06 శాతానికి పడిపోయింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మంది కరోనా బారిన పడగా… 4.24 కోట్ల మంది కోలుకున్నారు. మొత్తం 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 181 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/