దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో 49,464మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా..157 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,77,459కి చేరింది. 4,41,43,342 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,421 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంటల్లో ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,696కి చేరింది.
ఇక దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 0.01శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.80శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 220.06 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/