151 సినిమా ప్లాన్స్‌

Megastar-Chiranjeevi
Mega Star Chiranjeevi

151 సినిమా ప్లాన్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెం.150 శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.. వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్‌చరణ్‌ స్వయంగా నిర్మిస్తున్నారు.. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈసినిమా సెట్స్‌పై ఉండగానే మెగాస్టార్‌ తదుపరి సినిమా కు సంబంధించిన చర్చలు కూడ ఇప్పట్లుంచే మొదలయ్యాయి.. గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో ఈసినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఇక ఈసినిమా కోసమే చిరు టీం ఇప్పటికే ఇండస్ట్రీలోని టాప్‌ కమర్షియల్‌ డైరెక్టర్లతో సంప్రదింపులు జరుపుతోందట.. చిరంజీవికి మాస్‌ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన ఆయ బ్లాక్‌బస్టర్‌ సినిమాల స్టైల్లో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా తెరకెక్కనుందట.. 150వ సినిమాలాగే ఆ తర్వాత వచ్చే సినిమాను కూడ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అల్లు అరవింద్‌ ఇప్పట్లుంచే సన్నాహాలు చేసుకుంటున్నారట.. ఇక డిసెంబర్‌ నెలాఖరులో కానీ, జనవరీలో కానీ చిరు 151వ సినిమా అనౌన్స్‌ అయ్యే అవకాశం కన్పిస్తోంది.