ఝార్ఖండ్ లో ఘోరం: విద్యార్థినిని అపహరించి కారులోనే సామూహిక అత్యాచారం..

దేశంలో మహిళలకే కాదు అభం శుభం తెలియని పసి పిల్లలకు కూడా రక్షణ లేకుండా అయిపోతుంది. ప్రభుత్వాలు , పోలీసులు , కోర్టులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న , చట్టాలను తీసుకొస్తున్న కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఝార్ఖండ్ లో దారుణం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థినిని అపహరించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు.

వివరాల్లోకి వెళ్తే..

ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో గురువారం సాయంత్రం బాలిక ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఐదుగురు దుండగులు కారులో ఆమెను వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక అడ్రస్​ చెప్పాలంటూ ఆమెతో మాట కలిపారు. కారులోకి ఎక్కించుకుని అపహరించారు. రాతూ స్టేషన్​ సమీపంలోని ఓ రెస్టారెంట్​ వద్ద కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి పెట్రోలింగ్​ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా ఉన్న కారును గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి కారును తనిఖీ చేశారు. అందులో ఐదుగురు యువకులు అసభ్యకరంగా కనిపించటం, వారి మధ్యలో బాలిక ఏడుస్తూ ఉండటాన్ని గమనించి వెంటనే ధుర్వ స్టేషన్​ ఇంఛార్జ్​ ప్రవీన్​ ఝాకు ఫోన్​ చేసి అదనపు బలగాలను పంపించాలని కోరారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు ఐదుగురిని అరెస్ట్ చేశాయి. విచారణలో ఐదుగురు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.