నకిరేకల్ శివారులో నర్సింగ్ కాలేజ్ స్కూల్ బస్సు బోల్తా

నకిరేకల్ శివారులో నర్సింగ్ కాలేజ్ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన లో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. సూర్యాపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు నల్గొండలో సోమవారం పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు రాసేందుకు స్టూడెంట్స్ అందరూ కాలేజ్ బస్సులో బయలుదేరారు. నకిరేకల్ శివారులో హైవే నుంచి నల్గొండ వైపు రోడ్డు టర్న్ తీసుకుంటుండగా.. ఎదురుగా లారీ వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు పల్టీలు బోల్తా పడింది.

ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్యూపెన్సీకం మించి స్టూడెంట్స్ బస్సులో ఉన్నట్లు సమాచారం. ఇక గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాదఘటనపై మంత్రి హరీష్ రావు ఆరా తీశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.