ఘోర రైలు ప్రమాదం… 15 మంది మృతి

రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులు..దూసుకెళ్లిన గూడ్స్ రైలు

ఘోర రైలు ప్రమాదం… 15 మంది మృతి
Migrant Workers Run Over by Train in Aurangabad
ఘోర రైలు ప్రమాదం… 15 మంది మృతి

ఔరంగబాద్‌: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం సంభవించింది. . రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి ఓ గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది. కాగా చనిపోయిన వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. వలస కూలీలు మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ వెళ్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారంతా రైల్వే ట్రాక్ పక్కనే కాలి నడకగా స్వస్థలాలకు వెళుతున్నట్లుగా తెలిసింది. మార్గ మధ్యలో పట్టాలపై నిద్రించినట్లుగా సమాచారం. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న వెంటనే, రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/