భారత్‌లో మరో 15 మందికి కరోనా వైరస్!

భారత్‌ పర్యటనకు వచ్చిన 15 మంది ఇటలీ పర్యాటకులకు సోకిన కరోనా వైరస్‌

Coronavirus 23
Coronavirus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) విజృంభిస్తుంది. భారత పర్యటనకు వచ్చిన 15 మంది ఇటలీ దేశీయులకు కరోనా వైరస్‌ సోకినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో, వీరిని ఢిల్లీలోని క్వారంటైన్ కు తరలించారు. మొత్తం 23 మంది ఇటాలియన్ టూరిస్టులు ఇండియా పర్యటనకు వచ్చారు. గత నెలలో ఢిల్లీ నుంచి రాజస్థాన్ కు వెళ్లారు. వీరిలో ఒక వ్యక్తి ప్రస్తుతం జైపూర్ లో ఉన్నారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయన భార్యను కూడా వైరస్ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 60కి పైగా దేశాలకు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 90 వేల మందికి ఈ వైరస్ సోకగా… దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా వైరస్‌ కేసులు భారత్‌లో 21కి చేరినట్లైంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/