ములుగు జిల్లాలో దారుణం

huts Torched
huts Torchedములుగు: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం బందాల గ్రామంలో ఆదివాసీ గ్రామానికి దగ్గర్లో ఉన్న అడవిలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి. అయితే అక్కడి మంటలు ఆదివాసీ గ్రామంలోని గుడిసెల వరకు వ్యాపించాయి. దీంతో 15 గుడిసెలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. బాధిత కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. కట్టుబట్టలతో వారు రోడ్డున పడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/