బద్వేల్ ఉప ఎన్నిక బరిలో ఎంతమంది పోటీ చేస్తున్నారో తెలుసా..?

తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక జరగబోతుంది. బద్వేల్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఈరోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లను ఉప సంహరించుకోగా.. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ దాఖలు చేశారు.

అయితే.. నామినేషన్ల పరిశీలనలో 9 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో నామినేషన్ల ఉప సంహరణ అనంతరం చివరిగా 15 మంది అభ్యర్థులు మాత్రమే బద్వేలు ఉప ఎన్నికల బరి లో ఉన్నారు. వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఖాళీ అయిన బద్వేలు స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇక బద్వేల్ ఉప ఎన్నిక బరిలో వైసీపీ నుండి డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేశారు. భాజపా అభ్యర్థిగా పనతల సురేష్​ను బరిలోకి దిగుతున్నారు.