15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం

sharmila
sharmila

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిళ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని సైబర్‌ క్రైమ్‌ అడిషనల్‌ డిసిపి రఘువీర్‌ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..షర్మిలపై అసత్యాలు ప్రచారం చేస్తున్న 10 సైట్లను గుర్తించామని, సోషల్‌ మీడియాలో కామెంట్స్‌పై విచారణ చేస్తున్నామన్నారు. విచారణ కోసం ప్రత్యేత టీమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. 15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సైబర్‌ క్రైమ్‌ అడిషనల్‌ డిసిపి రఘువీర్‌ పేర్కొన్నారు.