15 మందికి పోలీసు సేవాపతకాలు
హైదరాబాద్: రిపబ్లిక్ వేడుకల సందర్బంగా 15 మంది పోలీసు సేవా పతకాలు అందుకోనున్నారు. విజిలెన్స్ నెల్లూరు ఎస్పీ పి.రామశేషయ్య, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ బి. శ్రీనివాస్, తిరుపతి ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ ఎస్.రాజశేఖరరావు, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ డిఎస్పీ వి.విజయభాస్కర్, విజయవాడ సిఐడి డిఎస్పీ ఎన్.సత్యానందం, విజయనగరం ఎసిబి డిఎస్పీ సిహెచ్ లక్ష్మీపతి, అనంతపురం డిఎస్పీ ఎన్.సుబ్బారావు, ట్రాఫిక్ ఎసిబి కె.ప్రభాకర్, విశాఖ తూర్పు సబ్‌డివిజన ఎసిపి ఆర్.రమణ, పశ్చిమగోదావరి జిల్లా ఎస్ఐ రమేష్‌బాబు, నెల్లూరు ఎస్ఐ లక్ష్మయ్య, మంగళగిరి ఎపిఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ రంగారెడ్డి సేవా పతకాలు అందుకోనున్నారు.