15వ ఆర్థిక సంఘం ద్వారా ఏపికి న్యాయం జరిగాలి!

Chandrababu
Chandrababu

అమరావతి: నాలుగేళ్ల తరువాత కూడా పొరుగు రాష్ట్రల కంటే ఏపి తలసరి ఆదాయంలో వెనుకంజలో ఉందని, 14వ ఆర్థిక సంఘం అంచనాలు తప్పాయని సిఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ అధికారుతలో సిఎం సమావేశం అయ్యారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా ఏపికి న్యాయం జరిగేలా చూడాలని, ఏపికి జరిగిన అన్యాయం చక్కదిద్దాలని వినతిపత్రంలో కోరాలని అధికారులను ఆదేశించారు. నాలుగేళ్లయినా విభజన చట్టాన్ని అమలు చేయలేదన్నారు. ఏపికి అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.