14వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మికం

14th Pasuram: Thiruppavai
14th Pasuram: Thiruppavai

ఉజ్గళ్‌ పుళైక్కడై త్తోట్టత్తువావియుళ్‌
శెజ్గళునీర్‌ వాయ్ నెకిళున్దు ఆమ్బల్‌
వాయ్ కూమ్బినకాణ్‌
శెంగల్‌ పాడిక్కూఱై వెణ్బల్‌ తవత్తవర్‌
తంగళ్‌ తిరుక్కోయిల్‌ శింగిడువాన్‌ పోకినా€ర్‌
ఎంగళై మున్నమ్‌ ఎళుప్పువాన్‌ వాయ్ పేశుమ్‌
నంగావిజయ్! ఎళున్దిరావిజయ్!
నాణాదావిజయ్! నావ్ఞడైయాయ్!
శంగొడు శక్కర మేన్దుమ్‌ తడక్కైయన్‌
పంగయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్

పధ్నాలుగవ పాట

మీ తోట బావిలో ఎఱ్రకలువలు విరిసె
నల్ల కలువలు ముకుళించె నాతి లేవమ్మా
ధవళ దంతాలు మెరయ, కావి వస్త్రాలు కట్టి,
దేవళాలు తెరచి దేవతార్చన సేయ
తాపసుల బృందాలు తరలివెళ్ళె
మమ్మే లేపదనంచు మాట ఇచ్చిన నీవు
లేశ మాత్రము బిడియంబు లేకపోగ
మైమరచి నిదురించ మర్మమేమి?శంఖ
చక్రాలు చేబూనువాని ఆజానుబాహుని
కమల నయనాల కరుణకురుయువాని
మధురగీతాలు పాడుమా మా మంజువాణి

భావం: ఎర్ర తామరలు వికసిం చినవి, నల్లకలువలు ముడుచుకొన్నవి. జేగురురాళ్లు పొడితో రంగు అద్దిన వస్త్రములతో తెల్లని పలువరుస కలిగిన సన్యాసులు తమ దేవాలయమునకు ఆరాధన చేయుటకు పోవ్ఞచున్నారు. ఓ పరిపూర్ణులారా, ఓ సిగ్గులేనిదానా, ఓ మాటనేర్పుగలదానా మధురముగా మాటలాడుదానా శంఖ చక్రములు ధరించిన పొడవైన బాహువ్ఞల గల పుండరీకాక్షుని భజించుటకు రావమ్మా అని వెలుపలి గోపికలు లోపలి గోపికను మేల్కొలుపుతున్నారు.

ఫలం: జ్ఞానము కలుగుతుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/