రాజీ లేదు

ASHOK GAJA{ATI
ASHOK GAJA{ATI

రాజీ లేదు

పదవీత్యాగానికి సిద్ధపడిన మరో కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు
సస్పెండ్‌ చేసినా ఉభయసభల బయట ఆందోళన
అవిశ్వాసంపై టిడిపి అధిష్టానం తర్జన భర్జన
ఒకపక్క న్యాయ నిపుణులతో మరోపక్క జాతీయ నేతలతో బాబు చర్చలు

అమరావతి : టిడిపి సీనియర్‌నేత,కేంద్రమంత్రి పి.అశోక్‌ గజపతిరాజు విభజనహామీల అమలుకు, రాష్ట్రప్రయోజనాల దృష్ట్యా కేంద్ర,రాష్ట్ర బిజేపి,టిడిపిల మధ్య నెలకొన్న వివాదా లతో సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే చాలు తాము పొత్తునుంచి వైతొలగేందుకు మంత్రిపదవికి రాజీనామా చేస్తానని అశోక్‌ గజపతి రాజు సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకు మరో కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి, టిడిపి ఎంపీలే కేంద్రంపై నిరస నలతో పాటు ఢీ అంటే ఢీ అనే తరుణంలో కొంత కాలంగా అశోక్‌గజపతిరాజు తనసొంత జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో గజపతిరాజు టిడిపి అధిష్టానం కొంతదూరంగా ఉంటూ బిజేపి అధిష్టానా నికి దగ్గరగా ఉన్నారు.

దీంతో టిడిపి నేతలు బిజేపి అధిష్టానానికి దగ్గరగా ఉన్నారు.దీంతో టిడిపి నేతలు అశోక్‌గజపతిరాజుపై అనేక సందేహాలతో ఇకపార్టీలో కొనసాగుతారో లేదో అనే అనుమానాలు ఏర్పడ్డాయి. ఈనేపధ్యంలో అధిష్టానం జోక్యం చేసుకొని కేంద్రంపై ఇక పోరాటమేనంటూ అశోక్‌కు చెప్పడం శుక్రవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరై బాబు ఆదేశాలే తనకు శిరోధార్యమని ప్రకటించడంతో ఇక టిడిపి ఎంపీలంతా సోమవారం నుంచి మూకు మ్మడిగా పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు.

అశోక్‌ విభజనతో రాష్ట్ర ప్రజలకు కష్టాలు వచ్చాయని కేంద్రం ఆకష్టాలను రూపుమాపి రాష్ట్రానికి న్యాయం చేయ డానికి విభజన చట్టం హామీలను నెరవేర్చేందుకు పోరాటానికి వెనుకాడనని ప్రకటించారు. అయితే టిడిపి అధినేత బాబుకు బిజెపి చీఫ్‌ అమిత్‌షా ఫోన్‌చేసి రాష్ట్ర సమస్యలపై చర్చలకు ఆహ్వానించ డంతో బాబు కేంద్రమంత్రి వై.సుజనాచౌదరిని, ఎంపీలు, అధికార్లను పంపుతానని చెప్పారు.మరోపక్క టిడిపి అధిష్టానం మెత్తపడకుంటే ఉభయసభల్లో టిడిపి ఎంపీలు నిరనలకు పాల్పడితే సస్పెండ్‌ చేస్తామని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది.మిత్రపక్షంగా ఉన్న టిడిపి,బిజేపీలు పొత్తు తెంచుకుంటే తప్పా సస్పెండ్‌ చేయరాదనేది జగమెరిగిన సత్యం.

తమను సస్పెండ్‌ చేసినా ఉభయసభల బయట ఆందోళన చేస్తామని టిడిపి ఎంపీలు కూడా బిజేపి అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు.కేంద్రం రష్ట్రానికి నిధులకేటాయింపుల్లోను, విభజన చట్టం అమల్లోను,షెడ్యూల్‌ 9,10,11,13లను గాలికి వదిలేసి కేవలం ఎంపీల ఆందోళనను అడ్డుకోవ డానికే తరచూ రాష్ట్రంతో కేంద్రం చర్చలతో కాలయా పనను రాష్ట్రం గుర్తించి జాగ్రత్త పడుతోంది.ఈ నేపధ్యంలో ఉభయ సభల్లో టిడిపి ఎంపీల ఆందోళన అడ్డుకునే ప్రయత్నం చేయడంకానీ,సస్పెండ్‌ చేయడం కానీ జరిగితే ఉభయసభల బయట ఎంపీలు తారా స్థాయిలో నిరసనకు సిద్ధపడ్డారు.

అలాగే అవిశ్వాసం పెట్టినా వీగిపోతాదే తప్పా ఉపయోగం ఉండదని, వైఎస్సార్సీ, కాంగ్రెస్‌పార్టీలు అవిశ్వాసతీర్మానం ప్రవేశ పెడితే టిడిపిపై రాష్ట్ర ప్రజలకు వ్యతిరేక సంకేతాలు వెళతాయనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.అయితే జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు వైఎస్సార్సీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి సవాల్‌ విసురుతూ తాము కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, లేనిపక్షంలో టిడిపిప్రవేశపెట్టాలని ఆరెండింటికి టిడిపిని ఒప్పించాలని డిమాండ్‌చేశారు.

పవన్‌ ఆ బాధ్య తలను తన భుజస్కందాలపై వేసుకున్నారు.అయితే రాజకీయంగా పవన్‌కు అనుభవం లేకపోవడంపై పవన్‌హామీని టిడిపి ఏమేరకు ఒప్పుకుంటుందో అనుమానమే.పవన్‌ టిడిపితో పొత్తుపై క్లారిటీ ఇస్తే టిడిపి ఏమైనా తలొగ్గవచ్చని అంటున్నారు.అయితే వైఎస్సార్సీతో టిడిపి కలిసికాని,వారికి మద్దతు ఇవ్వడంపై అనుమానమేను.ప్రస్తుతం నెలకొన్న పరిస్థిల దృష్ట్యా కేంద్రంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించ డానికి న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలి సింది.

అలాగే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు జాతీయ నేతలతో సంప్రదింపులు చేస్తూ కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడకట్టడం చేస్తున్నట్లు తెలిసింది.సోమవారం నుంచి జనసేన నేతృత్వంలో ఏర్పడిన జెఎఫ్‌సీ, విభజన చట్టం అమలు కమిటీ, ఉభయకమ్యూ నిస్టులు, వైఎస్సార్సీ పార్టీలు ఢిల్లీలో చేపట్టనున్న ఆందోళనలతో ఢిల్లీలో కేంద్రంపై కాకపెరగనున్నది. దీన్ని టిడిపి కూడా తనకు అనుకూలంగా మలుచుకో నున్నది.

ఇదిలా ఉండగా నిన్నటివరకు టిడిపికి చెందిన కేంద్ర మంత్రి పి.అశోక్‌గజపతిరాజుపై పార్టీకి దూరమైతే విజయనగరం జిల్లాలో పార్టీకి పెద్దలోటే జరిగేది.విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రాజ కీయ పరిణామాలతో ఆజిల్లా ఇంచార్జీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కేంద్రమంత్రి పి.అశోక్‌ గజపతిరాజుల మధ్య తలెత్తిన వివాదంతో పాటు అశోక్‌ గజపతి రాజుకు వ్యతిరేక వర్గానికి చెందిన నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టడంతో అశోక్‌ గజపతిరాజు పార్టీ అధిష్టానంతో అంటిఅంటనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా బిజేపి పెద్దలతో సన్నిహితంగా ఉంటూ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోనే సత్సంబం ధాలను కొనసాగిస్తున్నారు.

ఈ మద్య ముగిసిన మొదటి విడత బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయసభల్లో టిడిపి ఎంపీలు నిరసన వ్యక్తంచేసే సమయంలోనే ప్రధానిమోదీ అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రిగా బాగా విధులను నిర్వహిస్తున్నారనిఆయన సేవలను నిండు సభలో కొనియాడారు.