ఖగ్గల్‌ ఘటనపై 144 సెక్షన్‌

khaggal
khaggal


కర్నూల్‌: మంత్రాలయం మండలం ఖగ్గల్ల్‌లో పార్టీ జెండా ఆవిష్కరించేందుకు వెళ్లిన తిక్కారెడ్డిపై వైఎస్‌ఆర్‌సిపి నాయకులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తిక్కారెడ్డి గన్‌మ్యాన్‌ గాల్లో కాల్పులు జరపగా తిక్కారెడ్డి, మధువరం ఎఎస్‌ఐలకు గాయాలయ్యాయి. ఈ ఘటన వల్ల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఖగ్గల్‌లో 144 సెక్షన్‌ విధించారు. ఆదోని డిఎస్‌పి గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామానికి పోలీసులు, ఆర్‌పిఎఫ్‌ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.
మరోవైపు తిక్కారెడ్డిపై దాడికి నిరసనగా మంత్రాలయం నియోజకవర్గంలో ఆందోళనలు చెలరేగాయి. ఎమ్మిగనూరు, కౌతాళంలలో టిడిపి నేతలు శాసన సభ్యుడు బాలనాగి రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్ట బొమ్మను దగ్ధం చేశారు. బాలనాగి రెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.