దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య3,42,60,470
corona virus – india
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,313 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న కరోనా వల్ల 549 మంది మరణించినట్టు నమోదైంది. మరో 13,543 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,36,41,175కు చేరింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,61,555 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.
కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,42,60,470కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,57,740కు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 60,70,62,619 కరోనా పరీక్షలు నిర్వహించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/