నేడు 14ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

MMTS
MMTS

హైదరాబాద్‌: నగరంలో ఈరోజు 14 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ వీటిని నిలిపివేశారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో రామచంద్రాపురం, తెల్లాపూర్‌ మధ్య ట్రాక్‌ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ నెల 17 నుంచి సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం లింగంపల్లి ఫలక్‌నుమా, హైదరాబాద్‌ల మధ్య నడిచే రైళ్లను నిలిపివేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.