చైనా బొగ్గు గనిలో ప్రమాదం..14 మంది మృతి

China -coal mine
China -coal mine

చైనా : చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో గ్యాస్‌ లీకై 14మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. సిచూవన్‌ కోల్‌ ఇండస్ట్రీ గ్రూప్‌నకు చెందిన షన్‌ముషు బొగ్గు గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన సమయంలో 346 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. గనిలో చిక్కుకున్న బాధితుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/