ప్రతి పేదవాడికి మంచి వైద్యం నా ఉద్దేశ్యం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 

AP CM YS Jagan
AP CM YS Jagan Mohan Reddy
  • 14 మెడికల్‌ కాలేజీలకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన.
  • ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కళాశాల.
  • రూ.8000 కోట్లతో మెడికల్‌ కాలేజీల నిర్మాణం.
  • ప్రతి గ్రామంలోనూ వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు .
  • రూ.246 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు.
  • 2436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి .
  • వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు .
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పెన్షన్‌ .
  • ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా ఇప్పటి వరకు రూ.5,215 కోట్లు చెల్లింపు.

Tadepalli: రాష్ట్రంలో ఏ పేదవాడికి ఇబ్బంది కలుగకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పేదవాడికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం కొత్తగా 14 మెడికల్‌ కాలేజీలకు సీఎం వైయస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఇప్పటికే పులివెందుల, పాడేలో మెడికల్‌ కాలేజీల పనులు జరుగుతున్నాయని, ఈ రోజు మరో 14 కొత్త మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక టీచింగ్‌ కాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కొత్త కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు తెచ్చామని, 2436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మనందరి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతున్నామన్నారు..

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ ఆసుపత్రి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసి డాక్టర్లు అందుబాటులోకి తీసుకువచ్చే గొప్ప కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నామన్నారు.

రాష్ట్రం అవతరించిన కాలం నుంచి , బ్రిటిష్‌ కాలం నుంచి మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయగలిగే పరిస్థితిలోకి వెళ్తున్నాం. ఇంత గొప్ప అవకాశం దేవుడిచ్చినందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.మూడేళ్లలో ఈ ఆసుపత్రులను పూర్తి చేసేలా రూ.100 కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినా కూడా ఒక్కొక్కరికి రెండెకరాలు భూమి ఉచితంగా ఇస్తుందన్నారు.

ఈ రోజు 14 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇదీవరకే రెండు కాలేజీలను ప్రారంభించాం. వీటి నిర్మాణానికి రూ.8 వేల కోట్లు ఖర్చు చేయగలుగుతున్నామని సంతోషంగా చెబుతున్నాను. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా, రాబోయే అవసరాలను బేరిజు వేసుకొని, ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేయడమే కాకుండా పేదవారికి మంచి వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, మార్కాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందులలో 16 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం. విశాఖ జిల్లా పాడేరు, వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో రెండు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణం పనులు ఇప్పటికే ప్రారంభించారు. 2023 డిసెంబర్‌నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/