చంచల్ గూడ జైలుకు తీన్మార్ మల్లన్న..

జర్నలిస్ట్​, క్యూ న్యూస్ అధినేత తీన్మార్​ మల్లన్న ( చింతపండు నవీన్)ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డబ్బుల కోసం బ్లాక్​ మెయిల్​ చేశాడని జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్​శర్మ చేసిన ఫిర్యాదు మేరకు మల్లన్న ను అరెస్ట్ చేసి..శనివారం సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడంతో మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే, ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో మల్లన్నను చంచల్ గూడ జైలుకు తరలించారు. తన క్లయింట్‌పై ఐపీసీ 306,511 సెక్షన్ల నమోదుచేయడం తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది ఉమేష్ చంద్ర అభ్యంతరం తెలిపారు. ఫిర్యాదుదారుడు ఎలాంటి సూసైడ్ అట్టెంట్ చేయలేదని కోర్ట్ దృష్టికి న్యాయవాది తీసుకువెళ్లారు. అయితే కోర్టు దానిని గురించి పరిశీలిస్తామని తెలిపారు.