14.5% పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు

smart phone
smart phone

న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్‌మార్కెట్‌ 14.5శాతంపెరిగిందని ఐడిసి సర్వేలో తేలింది. డిసెంబరు చివరినాటికి మూడోత్రైమాసకంలో 15.1శాతం ఎగుమతులు తగ్గినట్లు వెల్లడించింది. జులై సెప్టెంబరు మద్యకాలం ఎగుమతులకంటే డిసెంబరు చివరినాటికి కొంతమేర తగ్గినప్పటికీ మొత్తంగా మార్కెట్‌ వాటా మాత్రం పెరిగింది. గత ఏడాదిలో ఎగుమతులు 124.3 మిలియన్‌ యూనిట్లు జరిగాయి. స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు 19.5శాతం ఏటికేడాదిచొప్పున పెరిగి 36.3 మిలియన్‌ యూనిట్లకు పెరిగాయి. అంతకుముందు 30.3మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉన్నాయని అంచనావేసింది. ఇటెయిలర్ల భారీ విక్రయాలు, దీపావళి వంటి పండుగ వేళల్లో డిసెంబరు నాటికి మరింతగా పెరుగుతాయని అంచనావేస్తున్నారు. 2018 డిసెంబరునాటికి ఎగుమతి గణాంకాలు 15.1 శాతం తగ్గాయి. మార్కెట్‌పరిస్థితులు, ఒత్తిడికి లోబడి కొంతమేర హెచ్చుతగ్గులకు లోనయినట్లు తెలుస్తోంది. 2018 హైలైట్లనుపరికిస్తే ఆన్‌లైన్‌ బ్రాండ్లు ఎక్కువ వాటాతో ఉన్నాయి. ఆల్‌టైమ్‌ గరిష్టానికి అంటే 2018లో 38.4 శాతానికిపెరిగింది. నాలుగోత్రైమాసికంలో 42.2శాతంగా ఉన్నాయి.ఐడిసి ఇండియా అసోసియేట్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసన జోషి రానురానుమరింతగాపెరుగుతాయని వెల్లడించారు. ఇటైలర్లు అనేకపర్యాయాలు డిస్కౌంట్లుప్రకటించడంకూడా ఇందుకు బలమైన కారణంగా అంచనావేసారు. అందుబాటుధరల్లో స్మార్ట్‌ఫోన్లు రావడం, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లుసైతం కొంత బైబాక్‌ స్కీంలు వంటివి ఆకర్షణీయంగా మారాయి. ఆఫ్‌లైన్‌ఛానల్‌లో 6.7శాతం వృద్ధితో ఉందని, నాలుగోత్రైమాసికంలో మాత్రం ఐదుశాతం వృద్ధి ఉంటుందని అంచనావేసింది. ఇటెయిలర్స్‌ ఇస్తున్న పోటీలకు క్యాష్‌బ్యాక్‌ ఆర్డర్లకు ఆఫ్‌లైన్‌ రిటైలర్లు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఐడిసి అసోసియేట్‌రీసెర్చి డైరెక్టర్‌ నవ్‌కేందార్‌ సింగ్‌ మాట్లాడుతూ 2018లో వయా ఇటైలర్లు, భాగస్వామ్య వెంచర్ల వంటి వాటితో దీర్ఘకాలికంగా ప్రణాళికలు వేసుకుని ముందుకుపోతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఇకామర్స్‌ మార్గదర్శకాలు అమలుకు వచ్చినతర్వాత ఈ మార్కెట్‌ వాతావరణం పూర్తిగా మారుతుందని అంచనా. ఇకామర్స్‌ంస్థలు ఇకామర్స్‌ కంపెనీలు ఎలాంటి బ్రాండ్స్‌తోను టైఅప్‌లు ఉండవని అంచనావేసింది. ఇక ్పధాన కంపెనీల్లో షావోమి అగ్రస్థానంలోనిలిచింది. 28.9శాతం ఎగుమతులున్నాయి. తర్వాత శాంసంగ్‌ 18.7శాతం,తో నిలిచింది. వివో 9.7శాతం మార్కెట్‌ వాటాతో నిలిచింది. నాలుగోత్రైమాసికంలో పదిశాతం వాటా ఉంటుందని మొత్తంగాచూస్తే పూర్తి సంవత్సరానికి పదిశాతానికి పెరగవచ్చని అంచనావేస్తున్నారు. సగటుధరలు 2018లో 158 డాలర్లకు మించిలేదని 100-200 డాలర్లమధ్య ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌మార్కెట్లు భారత్‌కు వస్తున్నట్లు వెల్లడించారు. ప్రీమియం స్థాయి మార్కెట్‌ 500 డాలర్లకుపైబడినవి 43.9శాతంగా ఉన్నాయి. వన్‌ప్లస్‌ సంస్థ మార్కెట్‌లీడర్‌గా 500 నుంచి 700 సెగ్మెంట్‌లో నిలిచింది. ఫీచర్‌ఫోన్‌మార్కెట్‌పరంగాచూస్తే 56శాతంగా మొత్తంమార్కెట్‌వాటాతో ఉంది. 181.3 మిలియన్‌ యూనిట్లషిప్‌మెంట్‌జరిగింది. ఏటికేడాదిచ 10.6శాతంగా పెరిగింది. జియోఫోన్‌ షిప్‌మెంట్లు ఏడాదిపొడవునా పెరిగి 36.1శాతంగా నమోదయింది. మార్కెట్‌వాటాపరంగా జియోఫోన్‌కే ఎక్కువ వాటా దక్కిందని తెలుస్తోంది.