13వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మికం

Goda Devi
Goda Devi


పుళ్ళిన్‌ వాయ్ కీణ్డానై ప్పొల్లావరక్కనై
క్కిళ్లిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్
పిళ్త్ళైకళెల్లారుమ్‌ పావైక్కళమ్‌ పుక్కార్‌
వెళ్లియెళున్దు వియాళ పోదరిక్కణ్ణినాయ్
కుళ్లక్కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్లిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్‌
కళ్ళమ్‌ తవిర్‌న్దు కలన్దేలో రెమ్బావాయ్
పదమూడవపాట
బకుని చంపినవాని భజనలేచేయుచు
గోపికల గుంపొకటి గోపాలు చేరే
మల్లెపుష్పాన నల్లటి మధుపమట్లు
కనులున్న కన్నెకా! కదలిరావేమి?
శుక్రోదయంబయ్యె చూడవేమి?
తెల్లవారవచ్చె తెలియదేమి?
పక్షులే లేచినవి. పరుగులే తీసినవి
చల్లటి తీర్థాన తాపములు నశియించ
జలకమాడగరమ్మ పడకవీడిలెమ్మ!
ఇన్నినాళ్లకు మనకొచ్చె ఈ మంచిదినము

భావం: లోన తుమ్మెదలు గల తామరపూలను పోలిన కనులదానా, లేడివంటి చూపులు కలదానా, శుక్రుడు ఉదయిస్తున్నాడు. గురుడు అస్తమిస్తు న్నాడు. పక్షులు కూయుచున్నవి. బకాసురుని నోరును చీల్చిన కృష్ణుణ్ణి, రావణాసురుని పదితలలు నరికిన రాముడిని పూజిస్తూ గోపికలు వ్రత క్షేత్రమునకు చేరినారు. ఓ సుకుమారి, ఇంకా స్నానము చేయక పడుకొని యుంటివేమి? ఇది మంచిరోజు. కప టము వీడుము. మాతో కలిసిఆనందము అనుభవింపుము. అనుచు వెలుపలి గోపికలు మరొక గోపికను ఈ రోజు లేపుతున్నారు. అని కీర్తించి, ఆ గోపికను లేపమని కోరుతున్నారు.
ఫలం: అజ్ఞానం తొలగుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/