ప‌వ‌న్ డెడ్‌లైన్‌పై బాబు స్పంద‌న‌

Pawan , BABU
Pawan , BABU

అమ‌రావ‌తిః టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిమాండ్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీపై చంద్రబాబు స్పందించారు. ‘‘పవన్ జేఎఫ్‌సీతో మనకు ఇబ్బంది లేదు. పవన్ పోరాటంలో అర్థం ఉంది. రాష్ట్రానికి మేలు చేయాలని పవన్ పోరాటం చేస్తున్నారు.’’ అని నేతలతో చంద్రబాబు చెప్పారు. నిధుల వివరాలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ విధించిన డెడ్‌లైన్‌పై కూడా చంద్రబాబు చర్చించారు. శ్వేత పత్రం ఇవ్వాల్సింది కేంద్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం కాదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్వేత పత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు.