13% దిగజారిన భెల్‌ షేర్లు

bhel
bhel

13% దిగజారిన భెల్‌ షేర్లు

న్యూఢిల్లీ, మే 31: ప్రభుత్వరంగంలోని భెల్‌ షేర్లు 13శాతం దిగజారాయి. కంపెనీ నికరలాభాలు 57శాతంక్షీణించడమే ఇందుకుకారణం. ప్రారంభంలోనే నీరసంగా ప్రారం భం అయిన షేర్లు 12.81శాతం క్షీణించి 133.65 రూపాయలకు చేరాయి. ఎన్‌ఎస్‌ఇ లో కంపెనీ స్టాక్‌ 12.87శాతం దిగజారి 133.60 రూపాయలకు చేరింది. ఇక సంఖ్యా పరంగా 21.44 లక్షల షేర్లు కంపెనీలో బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇల్లో చేతులుమారాయి. భెల్‌ నికరలాభం 57శాతం దిగజారి 215.55 కోట్లకు చేరింది.

నాలుగోత్రైమాసికంలో లాభా లు తగ్గడానికి కారణం వేతనాల పెంపునకు భారీ కేటాయింపులు, తక్షణ వ్యయప్రణాళిక కేటాయింపులు పెరగడం వల్లనే లాభాలు తగ్గాయి. కంపెనీ అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 505.71 కోట్లుగా నిలిచింది. మొత్తం రాబడులు 10,302.79 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది నాలుగో త్రైమాసికంలో 10,870.49 కోట్లు అంచనావేసింది.