13న తెలంగాణ బంద్ లేదుః మంద‌కృష్ణ‌

Manda Krishna
Manda Krishna

హైదరాబాద్: ఈ నెల 13న చేపట్టిన రాష్ట్ర బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని.. వారి చదువులు ముఖ్యమని తెలిపారు. బాధ్యతతో బంద్ నిర్ణయం వాయిదా వేశామన్నారు. ఆ రోజు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. పార్లమెంట్‌లో బీజేపీ వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని.. బిల్లు కోసం ప్రధానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీకి అపాయింట్‌మెంట్‌ కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన 3 లేఖలను బహిర్గతం చేయాలని కోరారు. వర్గీకరణ తీరుపై ప్రభుత్వ వైఖరిని బట్టి మరోసారి ధర్నా చేసే అంశంపై ఆలోచిస్తామన్నారు. తమ బంద్‌కు మద్దతు తెలిపిన పార్టీలు, కుల, విద్యార్థి సంఘాలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.