12వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

Goda Devi

కనైత్తిళం కత్తెరుమై కను€క్కిరంగి
నినైత్తు ములైవళియే నిను€పాల్‌ శోర
ననైత్తిల్లమ్‌ శేఱాక్కుమ్‌ నఱ్చెల్వన్‌ తంగా§్‌ు!
పనిత్తలై వీళనిన్‌ వాశల్‌ కడైపత్తి
శినత్తినాల్‌ తెన్నిలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవ్ఞమ్‌ నీవ§్‌ు తిఱవా§్‌ు
ఇనిత్తానెళున్దిరాయ ఈదెన్న పేరుఱక్కమ్‌
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావా§్‌ుII
12వపాట
పాలపొంగులకన్న జ్ఞానసంపద ఉన్న
అన్నాచెల్లెలివమ్మ అరుదెంచవమ్మ
పదితలల రాక్షసుని పరిమార్చినట్టి
పరమపురుషుని కథలు పాడుచున్నాము
గోపికల గుంపొచ్చి నీగుమ్మమున నిల్చి
పిలుచుచున్నారు మంచులో తలలు తడిసి
అన్ని ఇండ్లవారు, అడ్డగించినవారు
వచ్చి చేరిరి మన వ్రతము తెలిసి
మాటలాడవ్ఞ ఇదియేమి మాయనిద్ర.
భావం: గేదెలు పాలు పితుకువాడు లేకపోవ్ఞటచేత లేగదూడలను తల చుకొని, దూడలు పాలుతాగుతున్నట్లు ఊహించుకుని, పొదుగుల నుండి పాలు కార్చుట చేత , ఇల్లంతా బురద అయినది. అటువంటి గేదెలు సంపద యున్న ఓ గోపకుడిని చెల్లెలు ఈరోజు గోపిక. ”పై నుంచి మంచుకురుస్తున్నది. మీ ఇంటి ద్వారము పట్టుకొని నిలబడియున్నాము. దక్షణముననున్న లంకాధిపతియైన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీరాముని గానము చేయుచున్నాము. ఇకనైనా మాట్లాడవా? ఏమి ఈ గాఢనిద్ర? ఇకనైనా లేవవా? ఇదంతా ఊరువారు చూస్తున్నారుఅనుచు వెలుపలి గోపికలు
లోపల ఉన్న ఈ గోపికను మేల్కొలుపుతున్నారు.ఫలం: అష్టాక్షరీ మంత్రము చదివిన ఫలితం లభిస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/