దేశంలో కొత్త‌గా 12,514 క‌రోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 4,58,437

న్యూడిల్లీ: దేశంలో కొత్త‌గా 12,514 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న క‌రోనా నుంచి 12,718 మంది కోలుకున్నారు. అలాగే, 251 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ మొత్తం కేసుల సంఖ్య 3,42,85,814కు చేరింది. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో ప్ర‌స్తుతం 1,58,817 మంది చికిత్స పొందుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,36,68,560 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,58,437 కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,06,31,24,205 మందికి క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. కేర‌ళ‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దేశంలో కొత్త‌గా న‌మోదైన 12,514 క‌రోనా కేసుల్లో 7,167 కేసులు కేర‌ళలోవే ఉన్నాయి. 251 మ‌ర‌ణాల్లో 167 మ‌ర‌ణాలు కేర‌ళ‌లోనే సంభ‌వించాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/