తెలంగాణలో ఒక్కరోజే 1213 కేసులు నమోదు

మరో 8 మంది మృతి

తెలంగాణలో ఒక్కరోజే 1213 కేసులు నమోదు
corona virus- Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్దృతంగా మారుతుంది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,213 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే ప్రథమం. జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 998 కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి పెరిగింది. ఇక, తాజాగా 987 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 9,069కి చేరింది. ప్రస్తుతం 9,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో మరో 8 మంది మృతి చెందగా, కరోనా మరణాల సంఖ్య 275గా నమోదైంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/