అసోంలో గ్రెనేడ్‌ పేలుడుపై రాజ్‌నాథ్‌ ఆరా

rajnath singh
rajnath singh


న్యూఢిల్లీ: అసోం రాష్ట్రంలోని గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై గురువారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరా తీశారు. గురువారం ఉదయం రాజ్‌నాథ్‌ సింగ్‌ అసోం రాష్ట్ర సియం సర్బానంద సోనోవాల్‌తో ఫోన్‌లో మాట్లాడి పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. గౌహతిలో పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రికి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రార్థించారు. గౌహతి నగరంలోని జూ రోడ్డులో షాపింగ్‌ మాల్‌ బయట రాత్రి 8 గంటలకు జరిగిన గ్రెనేడ్‌ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గౌహతి పోలీస్‌ కమీషనర్‌ దీపక్‌ కుమార్‌ చెప్పారు. బైక్‌పై వచ్చిన వారు గ్రెనేడ్‌ పేల్చారని కమీషనర్‌ దీపక్‌ కుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు. పేలుడు ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై ముమ్మరంగా గాలిస్తున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/