మే నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..!

నెల మారుతుందంటే ముందుగా గ్యాస్ ఖాతాదారులు , బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవుతారు. గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరుగుతుందో ..ఎంత తగ్గుతుందో అని చూస్తారు. ఇక బ్యాంకు ఖాతాదారులు బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో..ఎన్ని రోజులు ఓపెన్ అవుతున్నాయో అని ఎదురుచూస్తారు. ఇక ఇప్పుడు మరో నాల్గు రోజుల్లో ఏప్రిల్ నెల పూర్తి అయ్యి.. మే నెల రాబోతుంది. మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి మరి ఏ రాష్ట్రాలలో ఏ రోజులు సెలవులు వచ్చాయి అనేది ఇప్పుడే తెలుసుకుందాం.
మే 1, 2023: మహారాష్ట్ర డే/మే డే కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా మరియు త్రివేండ్రం లో సెలవులు.
మే 5, 2023: బుద్ధ పూర్ణిమ కారణంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లో బ్యాంకులు క్లోజ్.
మే 7, 2023: ఆదివారం
మే 9, 2023: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకులు క్లోజ్.
మే 13, 2023: రెండో శనివారం
మే 14, 2023: ఆదివారం
మే 16, 2023: రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా సిక్కింలో బ్యాంకులు పని చేయవు.
మే 21, 2023: ఆదివారం
మే 22, 2023: మహారాణా ప్రతాప్ జయంతి కారణంగా సిమ్లాలో బ్యాంకులు క్లోజ్.
మే 24, 2023: కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి కోసం త్రిపురలోని బ్యాంకులు క్లోజ్.
మే 27, 2023: నాల్గవ శనివారం
మే 28, 2023: ఆదివారం