12 లక్షల కోట్ల డాలర్ల వాణి్యం

DAVOS
DAVOS

12 లక్షల కోట్ల డాలర్ల వాణి్యం

దావోస్‌(స్విట్జర్లాండ్‌), జనవరి 17: కీలకమైన లక్ష్యాలను ఛేదించడం ద్వారా 2030 నాటికి 380 మిలియన్ల మందికి ఉపాధి కల్పించడం తో పాటు 12 లక్షలకోట్ల డాలర్ల వ్యాపారం కూడా చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ సర్వే సంస్థలు అంచనావేసాయి. అంతర్జాతీయ బిజినెస్‌, ఆర్థికరంగ నిపుణుల విశ్లేషణలు చూస్తే దావోస్‌లో విడుదల యిన ఈ నివేదిక మరిన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించింది. వాణి జ్యం, సుస్థిర అభివృద్ధి సంస్థ వంటివి బాధ్యతాయుతమైన సామాజిక రంగంగా పరివర్తనం చెందుతాయని ప్రకటించారు. కీలకమైన ఈ గ్రూప్‌ మేధావుల వేదిక దావోస్‌లో గత ఏడాది ప్రారంభం అయింది. పేదరికనిర్మూలన, సుస్థిర అభివృద్ధి, వాణిజ్య ప్రోత్సాహం లక్ష్యాలుగా కొనసాగుతోంది. బహుళజాతి సంస్థలైన ఎడెల్‌మాన్‌, పియర్‌సన్‌, ఇన్వెస్టెక్‌, మెర్క్‌, సఫారికామ్‌, అబ్రాజ్‌, ఆలిబాబా, అవైవా వంటి సంస్థలతోపాటు బోధనారంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, కార్మిక నాయకులు, ధాతృత్వ ప్రతినిధులు పలువురు ఈ గ్రూప్‌లో ఉన్నారు.

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డిజి)ని సాధించడం, పేదరికం నుంచి విముక్తి, భూగ్రహాన్ని పర్యావరణ కాలు ష్యం నుంచి రక్షించడం వంటివి ఉంటాయి. తాజా అధ్యయనం ప్రకా రం ఈ వేదిక ప్రైవేటు రంగంలోనే 2030నాటికి 12లక్షలకోట్ల డాలర్ల విలువైన వాణిజ్య అవకాశాలు ఉంటాయని ఉటంకించింది. విద్యుత్‌, నగరాలు, వ్యవసాయం, వైద్యఆరోగ్యరంగాల్లోనే ఈ మొత్తం సాధించ గలమని ఈ మేధావి వేదిక అభిప్రాయపడింది. వాణిజ్యరాబడులు, రాబడులద్వారా లబ్ధి వంటివి కీలకంగా ఉంటాయి. 90శాతం కొత్త ఉద్యోగాలు అభివృద్ధిచెందిన దేశాల్లోనే ఉంటాయని ఈ నివేదిక ఉటంకించింది.

కమిషన్‌ ఛైర్మన్‌ మార్క్‌ మాల్లోక్‌ బ్రౌన్‌ మాట్లాడుతూ గ్యాస్‌ ఉద్గారాల కుదింపు వంటివికూడా వీటి లక్ష్యాల్లో ఒకటిగా ఉం టుందని అన్నారు. దీర్ఘకాలంలో పెట్టుబడులు, నగదు లేదా వాటా దారులకు నగదు చెల్లింపు వయా షేర్ల బైబాక్‌, డివిడెండ్ల రూపంలో భారీ వృద్ధి ఉంటుందని అంచనా. మొత్తం 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యా లు 2015 సెప్టెంబరులో తీర్మానించడం జరిగింది. వాతావరణం, సురక్షిత నీరు, లింగ వివక్ష, ఆర్థిక అసమానతల తొలగింపుపై పోరా డాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో ఈ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిం చింది. పశ్చిమప్రాంతంలో మాత్రం వీటిపై కొంత కోపాగ్ని ఉంది.

వేతనాల్లో అసమాన తలు, వలసలు, కార్పొరేట్‌ పన్ను ఎగవేత, సిఇఒల వేతనాలు వంటి అంశాలు కీలకమే నని తేలింది. ఆహార వృధాను అరికడితే 405 బిలియన్‌ డాలర్లు ఆదా చేయగలమని 2030 నాటికి లక్ష్యాలు సాధిస్తే 2.4లక్షల కోట్ల డాలర్ల అదనపు వార్షిక పెట్టుబడులు ప్రత్యేకించి మౌలికవనరులరంగంలో సాధిం చవచ్చని దావోస్‌లోని బహుళజాతిసంస్థల మేధావుల వేదిక వెల్లడించింది. అంతర్జా తీయ ఆర్థికవ్యవస్థకుప్రస్తుతం సుస్థిర పెట్టు బడులు అవసరమని ఇందుకోసం లక్షలాది కోట్లడాలర్ల పెట్టుబడులను ఇప్పటినుంచే పొదుపుచేసుకోవాల్సి ఉం టుందని 2030నాటికి లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని సూచించింది.