తాలిపేరు ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత

Bhadradri Kottagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు 11 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 26,500 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతుండగా, 29,800 క్యూసెక్కుల నీటిని అధికారులు ఔట్‌ఫ్లోగా దిగువకు వదులుతున్నారు. తాలిపేరు ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 72.35 మీటర్లుగా ఉంది.