నార్వేలో డాక్ట‌రేట్ సాధించిన బంజారా అమ్మాయి

vimala nunavath
vimala nunavath

సిరిసిల్లః రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మారుమూల లంబాడీ తండా గర్జనపల్లికి చెందిన నునావత్‌ విమల నార్వేలో డాక్టరేట్‌ సాధించారు. పోలీసు, సైనిక, ఫైర్‌ మరియు రెస్క్యూ సర్వీసు, పురపాలక హెల్త్‌ కేర్‌ లాంటి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల్లో అత్యవసర సమయాల్లో అందరికీ ఒకేసారి సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ‘అత్యవసర ప్రతిస్పందన శాస్త్ర అభివృద్ధి’ అన్న అంశంపై ఆమె చేసిన పరిశోధనకు అగ్డర్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డాక్టరేట్‌ సాధించిన తొలి గిరిజన యువతిగా విమల నిలిచింది. – సిరిసిల్ల