భారత్ లో ఒక్క రోజే 11, 502 కరోనా కేసులు

24 గంటల్లో 325 మరణాలు

New corona cases in India
New corona cases in India

New Delhi: దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.  ఆదివారం దాదాపు 12 వేల కేసులు నవెూదు కాగా.. సోమవారం కాస్త తగ్గినా,కేసుల సంఖ్య భారీగానే ఉంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 325 మరణాలు సంభవించగా.. కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసులు నవెూదు అయ్యాయి..

దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,424 కి చేరింది.. ప్రస్తుతం.. 1,53,106 క్రియాశీల కేసులు ఉండగా.. 1,69,798 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు చేరారు..

తాజా మృతులతో కలుపుకొని.. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9520 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

దేశ రక్షణ శాఖ కార్యదర్శి నుంచి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వరకు కరోనా వాతపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ అధినేత బలరాం భార్గవ, నీతీఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌ తమ సహచరులకు కరోనా వచ్చిందని తేలడంతో క్వారంటైన్‌కు పరిమితమయ్యారు.

ఈ పరిణామాలు సామూహిక వ్యాప్తి జరగడంలేదని ప్రభుత్వం చేస్తున్న వాదనపై సందేహాలు ఏర్పడేలా చేస్తున్నాయి.

మొత్తం రక్షణ మంత్రిత్వ శాఖనే శానిటైజ్‌ చేయాల్సి రాగా ఆర్మీ కేంద్ర కార్యాలయమే ఉద్యోగుల రాకపోకల్ని, ముఖాముఖి సమావేశాల్ని పరిమితం చేసింది.

జూలై నాటికి ఢిల్లీలో కరోనా కేసులు అయిదున్నర లక్షలకు చేరుకుంటాయని ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారు.

. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులకు తప్ప మరెవరినీ ఆసుపత్రుల్లో చేర్చుకోలేమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించాల్సి వచ్చింది.

అయితే లెప్టినెంట్‌ గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకుని అందర్నీ చేర్చుకుంటామని ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/