దేశంలో కొత్త‌గా 11,451 క‌రోనా కేసులు

మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,61,057

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 11,451 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, క‌రోనా నుంచి 13,204 మంది కోలుకున్నారు. నిన్న క‌రోనాతో 266 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,42,826 మంది చికిత్స తీసుకుంటున్నారు. రిక‌వ‌రీ రేటు 98.24 శాతంగా ఉంది.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,37,63,104 మంది కోలుకున్నారు. మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,61,057కు చేరింది. కేర‌ళ‌లో నిన్న 7,124 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. నిన్న ఆ రాష్ట్రంలో 7,488 మంది కోలుకున్నారు. అలాగే, 21 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/