విద్యార్థుల్లో కనిపించని మాస్కులు, భౌతిక దూరం

చైనాలో స్నాతకోత్సవానికి హాజరైన 11 వేల మంది విద్యార్థులు

బీజింగ్ : కరోనా మహ్మమారి తొలిసారి వెలుగుచూసిన చైనాలో తిరిగి సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వుహాన్‌లోని ఓ యూనివర్సిటీ నిర్వహించిన స్నాతకోత్సవంలో 11 వేల మంది విద్యార్థులు మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.

ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా కరోనా గుప్పిట్లోనే ఉన్నాయి. మాస్కులు లేకుండా బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. పలు దేశాల్లో లాక్‌డౌన్ కూడా అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో వుహాన్‌ యూనివర్సిటీ 11 వేల మంది విద్యార్థులతో, అదీ ఎలాంటి ఆంక్షలు లేకుండా స్నాతకోత్సవం నిర్వహించడం  అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతేడాది డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులను, తాజాగా డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులను కలిపి వుహాన్ యూనివర్సిటీ ఈ స్నాతకోత్సవం నిర్వహించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/