భారత్ కు 11 వేల కోట్ల రుణం
ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ఆమోదం

న్యూ ఢిల్లీ; కరోనాపై భారత్ చేస్తున్న పోరుకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తుంది. గతంలో అమెరికా, భారత్ కు ఆర్థిక సాయం ప్రకటించగా, తాజాగా ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు భారత్ కు రూ. పదకొండు వేల కోట్ల మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులతో కరోనా నివారణ చర్యలతో పాటు, గత నెలలో కేంద్రం ప్రకటించిన అత్యవసర ప్రతిస్పందన పథకాలకు ఉపయోగ పడుతుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల అదనపు కార్య దర్శి సమీర్ కుమార్ చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.; https://www.vaartha.com/news/international-news/