జెఅండ్‌కె బ్యాంకులో 1100 కోట్ల కుంభకోణం

jnkbank
J&K Bank

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌బ్యాంకు మాజీ చీఫ్‌ మరో 23 మందిపై అవినీతినిరోధకశాఖ కేసులునమోదుచేసింది. బ్యాంకు ముంబయిలోని మాహిమ్‌బ్రాంచ్‌లోను, కొత్త డిల్లీ శాఖలోను మంజూరుచేసినరుణాలు 800కోట్లకుపైబడి అవకతవకలు జరిగాయని అంచనావేసింది. ఆర్‌ఇఐ ఆగ్రోకు ఇచ్చిన రుణాలు బోగస్‌ డాక్యుమెంట్ల ఆధారంగా మంజూరుచేసారని తేలింది. బ్యాంకులో సుమారు 1100 కోట్లరూపాయలమేరకు అవినీతిజరిగిందని, బ్యాంకింగ్‌ నియమనిబంధనలకు విరుద్ధంగా 2011-2013 మధ్యలో ఈ రుణాలు మంజూరయ్యాయని ఎసిబి గుర్తించింది. బ్యాంకు మాజీ ఛైర్మన్‌ ముస్తాక్‌ అహ్మద్‌షేక్‌, రైస్‌ఎక్స్‌పోర్ట్స్‌ ఇండియా ఆగ్రో లిమిటెడ్‌ ఛైర్మన్‌ సంజ§్‌ుఝన్‌ఝన్‌వాలా మరో 22 మందిపై ఈకేసును నమోదుచేసింది. నిందితుల ఇళ్లు కార్యాలయాలుమొత్తం 16 చోట్ల దాడులుచేసామని, సంస్థ ఎండి సందీప్‌ ఝన్‌ఝన్‌వాలా ఇళ్లు కార్యాలయాలుకూడా సోదాచేసినట్లుతెలిపారు. వీటిలో తొమ్మిది కాశ్మీర్‌లోయలోను, నాలుగుజమ్ములోను,మూడు ఢిల్లీ ఎన్‌సిఆర్‌ప్రాంతంలోను ఉన్నట్లు ఎసిబి ప్రతినిధి వివరించారు. ఈ సంవత్సరాల్లో ఆర్‌ఇఐ అగ్రోకు ఇచ్చిన రుణాలనునిరర్ధక ఆస్తులుగా తేల్చడం వల్ల బ్యాంకుకు ఆర్థికనష్టం భారీగాపెరిగిందని ఎసిబి వెల్లడించింది. ముంబయి మాహిమ్‌బ్రాంచ్‌నుంచి ఆర్‌ఇఐ ఆగ్రోకు 550 క ఓట్లు రుణాలుగా ఇచ్చింది. బ్యాంకు న్యూఢిల్లీలోని వసంత్‌విహార్‌బ్రాచ్‌ 139 కోట్లు కంపెనీకి రుణం ఇచ్చింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/