అమెరికాలో మరోసారి కాల్పులు..12 మంది మృతి

Virginia Beach
Virginia Beach

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల జరిగాయి. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్‌ నగరంలోశుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రభుత్వ భవన సముదాయం వద్ద ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి అదే ప్రభుత్వ భవనంలో పనిచేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు. విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ పోలీసు అధికారి కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


తాజా జాతీయ చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/