నీరవ్‌ మోది కార్ల వేలం!

nirav modi
nirav modi


న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్‌ మోదికి చెందిన 13 కార్లను ఈడి వేలం వేయనుంది. ఏప్రిల్‌ 18న వీటి వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అతనికి సంబంధించిన పెయింటింగ్స్‌ను వేలం వేసి ఐటి శాఖ రూ. 54.84 కోట్లు రికవరీ చేసింది. ఇప్పుడు అతనికి సంబంధించిన లగ్జరీ కార్లు రోల్స్‌రా§్‌ు్స ఘోస్ట్‌, రెండు మెర్సిడస్‌ బెంజ్‌, పోర్షె పనమెరా, మూడు హోండా కార్లు, టయోటా ఫార్చ్యూనర్‌, ఇన్నోవాలాంటి వాటిని వేలం వేయనున్నారు. నీరవ్‌ మోదీపై మనీ లాండరింగ్‌ కేసు పెట్టిన ఈడి ఈ కార్లను స్వాధీనం చేసుకుంది. మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఈ వేలం కాంట్రాక్టు అప్పగించారు. అటు లండన్‌ జైల్లో ఉన్న నీరవ్‌కు గత వారం వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించింది.

వార్తా ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/