కరోనా వైరస్: ఏపిలో 11 అనుమానిత కేసులు

అమరావతి: ఏపిలో కరోనా వైరస్( కోవిడ్-19) కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 11 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. విశాఖలో 5 కేసులు, శ్రీకాకుళంలో 3, ఏలూరు, విజయవాడ, కాకినాడలో ఒక్కోక్క కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో కోరనా అనుమానిత కేసులపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అనుమానితులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కరోనా అనుమానిత కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో మల్టీ సెక్టరల్ కో ఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, అదనపు సిఎస్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా అనుమానితులకు మైరుగైన వైద్యం అందిచాలని నిర్ణయించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/