10వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

10th Pashuram: Thiruppavai
10th Pashuram: Thiruppavai

నోత్తుచ్చువర్‌క్కమ్‌ పుగుగిన€ అమ్మనా§్‌ు!
మాత్తముమ్‌ తారారో వాశల్‌ తిఱవాదార్‌
నాత్త త్తుళా§్‌ుముడి నారాయణన్‌, నమ్మాల్‌
పోత్తప్పఱై తరుమ్‌ పుణ్ణియనాల్‌, పణ్డొరునాళ్‌,
కూత్తత్తిన్‌ వా§్‌ువీళ్‌న్ద కుమ్బకరణనుమ్‌
తోత్తమునక్కే పెరున్దుయిల్‌ తాన్‌ తన్దానో
ఆత్త అనన్దలుడై యా§్‌ు! అరుంగలమే!
తేత్తమా§్‌ు వన్దు తిఱవేలో రెమ్బావా§్‌ు!
పదవ పాట
మంచినోము నోచి, స్వర్గఫలముల దోచన
గొల్లభామలందు గొప్పదానవమ్మ
అతిశయమ్ము వీడి అరుదెంచవమ్మ
మనసార మా తోటి మాటలాడమ్మ
కుంభకర్ణుడు ఓడి నిదురనీకిచ్చెనా?
అతినిద్ర పోతగున అతనినే మించి
శ్రీకృష్ణుదాచిన ఓ చిన్నదానా
పట్టి ఇచ్చెను తులసి పరిమళాలు
మా గొప్ప గోష్ఠికి మణివినీవమ్మ
పరిశుభ్రముగ వచ్చి తలుపు తెరువమ్మా! భావం: ఇంకొక గోపిక ముందుగానే నోమునోచినది. సుఖానుభవము పొందుచున్నది. తలుపులు తెరవకపోయినను మాతో మాట్లాడరాదా, నిదురలో నీచే ఓడిపోయినందుకు కుంభకర్ణుడు తన సొత్తు అయిన గాఢనిదురను నీకు కప్పంగా ఇచ్చాడా? అధికమైన నిదురమత్తును వదులు, మైకము వీడు అని గోపికను మందలిస్తున్నారు. తులసీమాలల అలంకరణతో, కిరీటముగల నారాయణుడు, పుణ్యస్వరూపుడు అయిన కృష్ణుణ్ణి మంగళాశాసనములు పాడిన ‘పరయను వాయిద్యమును మనకి చ్చును. మాకందరకు మణిరత్నం లాంటి దానివి అని పొగుడుతూ త్వరగా వచ్చి తలుపు తీయవమ్మా అని వెలుపలి గోపికలు లోపలి గోపికను కోరుతున్నారు. ఫలం: అన్ని కష్టాలు తీరుట కొరకు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/