రైతులతో పదో విడత చర్చలు ప్రారంభం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రుల బృందం రైతు సంఘాల నేతల మధ్య పదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వన్‌లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ చ‌ర్చ‌ల‌కు రైతుల త‌ర‌ఫున వివిధ సంఘాల నేత‌లు హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున కేంద్ర‌ వ్య‌వ‌సాయశాఖ మంత్రి ‌న‌రేంద్ర‌సింగ్ తోమర్‌, కేంద్ర ఆహార పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. కాగా ప్ర‌భుత్వం, రైతుల సంఘాల ప్ర‌క‌ట‌న‌ల‌ను బ‌ట్టి చూస్తే ఈసారి కూడా చ‌ర్చ‌లు ఫ‌ల‌వంత‌మ‌య్యే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు.

వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు త‌మ ఆందోళ‌నను విర‌మించే ప్ర‌స‌క్తేలేద‌ని రైతు సంఘాల నాయ‌కులు తెగేసి చెబుతుండ‌గా, స‌వ‌ర‌ణ‌ల‌కు ఒప్పుకుంటాం త‌ప్ప చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దుచేసే అవ‌కాశం లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇవాళ 10వ విడ‌త చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/