వేతనాల పెంపుకు సీఎం సుముఖత

108 vehicle
108 Emergency Serviuces

అమరావతి: తమ డిమాండ్లను పరిష్కరించాలని 108 అత్యవసర సేవల వైద్య సిబ్బంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. 108 సిబ్బంది కోర్కెలను సానుభూతితో పరిశీలిస్తామని, వారికి వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని 108 ఒప్పంద ఉద్యోగుల యూనియన్‌ ప్రతినిధులు కలిశారు. తమకు 50శాతం జీతాలు పెంచాలని సీఎం చంద్రబాబును కోరారు. వైద్య సిబ్బంది వినతులను సానుకూలంగా స్పందించిన చంద్రబాబు త్వరలోనే సిబ్బంది జీతాలు పెంచుతామని భరోసా ఇచ్చారు. 108ఉద్యోగులది అత్యవసర సేవలు కాబట్టి 8గంటల డ్యూటీ విధానం వీలుకాదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా రెండు షిప్టులోనే పనిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బందికి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.